మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
close

తాజా వార్తలు

Published : 10/07/2020 22:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

ముంబయి: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే 7,826 కొత్త కేసులు నమోదుకాగా, గడచిన 24 గంటల్లో 226 మరణాలు సంభవించాయి. ఇవాళ ఒక్క రోజే 5,366 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,38,461కి చేరుకున్నట్లు పేర్కొంది. మొత్తం మరణాల సంఖ్య 9,893కి పెరిగింది. కరోనా కట్టడిలో భాగంగా పుణెలో జులై 13 నుంచి 23 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

* దేశ రాజధాని దిల్లీలో 2,089 కొత్త కేసులు బయటపడ్డాయి. 2,468 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. అలానే 42 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,140కి చేరుకుంది. రికవరీ అయిన వారి సంఖ్య 84,694కి చేరుకోగా, 3,300 మరణాలు చోటుచేసుకున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

* కర్ణాటకలో కొత్తగా 2,313 కేసులు వెలుగుచూశాయి. గడచిన 24 గంటల్లో 57 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 33,418కి, మరణాల సంఖ్య 543కి చేరింది.

* కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తమిళనాడులో ఇవాళ ఒక్కరోజే 3,680 కేసులు వెలుగుచూశాయి. 64 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,261కి పెరిగింది. మరణాల సంఖ్య 1,829గా నమోదైంది. ఇప్పటి వరకు 82,324 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని