అమెరికాలో ఆగని కరోనా ఉద్ధృతి
close

తాజా వార్తలు

Published : 12/07/2020 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాలో ఆగని కరోనా ఉద్ధృతి

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య కోటి 28 లక్షల 42 వేలు దాటింది. వీరిలో 5,67,653 మంది మృతిచెందారు. అలాగే 74,78,196 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అక్కడ బాధితుల సంఖ్య 33.55 లక్షలు దాటింది.  వీరిలో ఇప్పటి వరకు 1.37లక్షలకు పైగా మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 64 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 732 మంది మృత్యువాతపడ్డారు. ఫ్లోరిడా, అరిజోనా, టెక్సాస్‌, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్‌లో కొత్త కేసుల పెరుగుదల రేటు భారీ స్థాయిలో నమోదవుతోంది. ఇక న్యూయార్క్‌, న్యూజెర్సీ, మసాచ్యుసెట్స్‌, కనెక్టికట్‌, మిస్సిసిపీ, అర్కన్సాస్‌ రాష్ట్రాల్లో కేసులు నిలకడగా నమోదవుతున్నాయి. న్యూహాంప్‌షైర్‌, వెర్మోంట్‌ రాష్ట్రాల్లో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతుండడం గమనార్హం.  ఇక మరణాల రేటు విషయానికి వస్తే న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, లూసియానా రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంది. 

* బ్రెజిల్‌లో 18.40 లక్షలు దాటిన కరోనా కేసులు, 71,492 మరణాలు

* రష్యాలో 7.20 లక్షలు దాటిన కేసులు, 11,205 మరణాలు

* పెరూలో 3.22 లక్షలు దాటిన కేసులు, 11,682 మరణాలు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని