8లక్షల దిగువకు క్రియాశీల కేసులు
close

తాజా వార్తలు

Updated : 17/10/2020 09:52 IST

8లక్షల దిగువకు క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 74 లక్షలు దాటేసింది. అయితే గతంతో పోల్చుకుంటే కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. శుక్రవారం 9,99,090 నమూనాలను పరీక్షించగా 62,212 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,681గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 837 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,12,998కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 70,816 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 65,24,596 మంది కోలుకున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 7,95,087 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. 

గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు రికవరీ రేటు పెరుగుతోంది. దాదాపు 87.78 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.70 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,32,54,017 నమూనాలను పరీక్షించినట్లు కేంద్రం వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని