24 గంటల్లో 47,703 కేసులు.. 654 మరణాలు 
close

తాజా వార్తలు

Updated : 28/07/2020 10:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24 గంటల్లో 47,703 కేసులు.. 654 మరణాలు 

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 47,703 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14,83,156 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 4,96,988 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 9,52,743 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఈ మహమ్మారితో కొత్తగా 654 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశంలో మృతుల సంఖ్య 33,425కి చేరింది. నిన్న ఒక్కరోజు 5,28,082 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని