ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు
close

తాజా వార్తలు

Published : 24/10/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 80,238 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,765 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,00,684కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,544 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 4,281 మంది కోలుకోగా.. రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,62,419కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,721 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 74,28,014 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

గుంటూరులో నలుగురు కరోనాతో మృతి చెందగా.. కడప, కృష్ణలో ముగ్గురు చొప్పున చనిపోయారు. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరిలో ఇద్దరు చొప్పున, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని