తెలంగాణలో ఒక్కరోజే 879 కేసులు
close

తాజా వార్తలు

Updated : 23/06/2020 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో ఒక్కరోజే 879 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ తీవ్ర కలవర పెడుతోంది. రోజు రోజుకీ పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9వేల మార్కును దాటేసింది. మంగళవారం తాజాగా 879 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9553కు చేరుకుంది. వీటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 652 కేసులు, మేడ్చల్‌ జిల్లాలో 112, రంగారెడ్డి జిల్లాలో 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

220కి చేరిన మరణాలు

ఈ రోజు 3006 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. 879 పాజిటివ్‌ కేసులు వచ్చాయని బులిటెన్‌లో వెల్లడించింది. కొవిడ్‌ బాధితుల్లో 219మంది ఈ రోజు డిశ్చార్జి కాగా.. కొత్తగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది.  రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 9వేలకు పైగా కేసుల్లో 4224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో  ప్రస్తుతం  5109మంది చికిత్సపొందుతున్నారు. జిల్లాల వారీగా నమోదైన కేసుల్ని పరిశీలిస్తే.. 

బస్‌ భవన్‌లో ఇద్దరికి కరోనా 

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండో అంతస్థులో చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, ఐటీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కార్యాలయంలో శానిటైజ్‌ చేయించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగుల సహచరులకు కరోనా పరీక్షలు చేయించారు. దీంతో బస్‌ భవన్‌లో రేపు జరగాల్సిన తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం వాయిదా పడింది. 

అలాగే, శాసనసభ ఆవరణలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని