నడిరోడ్డుపై కుప్పకూలినా..కన్నెత్తి చూడలేదు
close

తాజా వార్తలు

Updated : 08/07/2020 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నడిరోడ్డుపై కుప్పకూలినా..కన్నెత్తి చూడలేదు

హైదరాబాద్‌‌: కరోనా భయం మానవత్వాన్ని కూడా మంటగలుపుతోంది. నడిరోడ్డుపై ఓ యువకుడు కుప్పకూలినా ఎవ్వరూ పట్టించుకోని హృదయవిదాకర ఘటన హైదరాబాద్‌ నగరంలోని ఏఎస్‌ రావునగర్‌లో చోటు చేసుకుంది. సకాలంలో ఎవ్వరూ స్పందించక పోవడంతో ఆ యువకుడు అక్కడిక్కడే మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌కు చెందిన పృద్వీరాజ్(31) గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.

బుధవారం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో యువకుడిని వేరే ఆస్పత్రికి తరలించేందుకై ఆటోలో ఎక్కిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి కిందపడి అపాస్మరక స్థితికి చేరుకున్నాడు. దీంతో స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది పరీశీలించి యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ యువకుడిని చేరదీసేందుకు ఎవరూ సాహసించలేదు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని