close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/06/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ బాధితుల మెదడుకు ముప్పు!

లండన్‌: కొవిడ్‌తో తీవ్రంగా బాధపడేవారి మెదడుకు హాని కలిగే ముప్పు ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్‌ యూనివర్సిటీ పరిశోధకులు... మహమ్మారితో బాధపడుతున్న పలువురి రక్త నమూనాలను ఇటీవల పరీక్షించారు. వైరస్‌ లోడు ఓ మోస్తరు నుంచి అధికంగా ఉన్నవారి రక్తంలో... గ్లియాల్‌ ఫిబ్రిలరీ యాసిడ్‌ ప్రొటీన్‌ (జీఎఫ్‌ఏపీ), న్యూరోఫ్లామెంట్‌ లైట్‌ చైన్‌ ప్రొటీన్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌)లు ఉన్నట్టు వారు గుర్తించారు. నిజానికి ఈ రెండూ మెదడులోని ఆస్ట్రోసైట్, మరో రకం నాడీ కణాల్లో ఉంటాయి. ఇవి దెబ్బతిన్నప్పుడు వాటిలోంచి ఈ రెండు ప్రొటీన్లు స్రవించి, రక్తంలో కలుస్తాయి. రక్తంలో వీటి ఉనికి ఉన్నవారి మెదళ్ల పనితీరులో లోపం కనిపిస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాదు. వెంటిలేటర్‌ ట్రీట్‌మెంట్‌ అవసరమయ్యే చాలామంది రక్తంలో ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఉంటోందట. పైగా, ఈ ప్రొటీన్‌ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే కొవిడ్‌-19 తీవ్రత అంతగా ఉంటోందనీ వారు గుర్తించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.