తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా
close

తాజా వార్తలు

Published : 15/06/2020 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

నిజామాబాద్: తెలంగాణలో మరో శాసనసభ్యుడు కరోనా బారినపడ్డారు. నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా నలతగా ఉండడంతో నిన్న బాజిరెడ్డితో పాటు ఆయన సతీమణికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అవగా.. భార్యకు నెగెటివ్‌ వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే దంపతులు హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఇప్పటికే మరో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా బాజిరెడ్డి గోవర్దన్ శనివారం డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ తండాలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వంద మందికి పైగా నేతలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన అనంతరం ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరులను అధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని