close

తాజా వార్తలు

Updated : 09/07/2020 08:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మైసూర్‌పాక్‌తో కరోనా తగ్గిపోతుందని ప్రచారం

స్వీట్‌ దుకాణానికి సీల్‌ వేసిన అధికారులు

కోయంబత్తూరు: మైసూర్‌ పాక్‌ వల్ల కరోనా నయమవుతుందని ప్రకటించిన వ్యక్తి నిర్వహించే స్వీట్‌ దుకాణానికి అధికారులు సీల్‌ వేశారు. కోయంబత్తూరు జిల్లా తొట్టిపాళెయంలో ఉన్న తిరునెల్వేలి లాలా స్వీట్‌ దుకాణ యజమాని తన దుకాణంలోని ఔషధ గుణాలు ఉన్న మైసూర్‌ పాక్‌ తింటే కరోనా ఒకే రోజులో నయం అవుతుందని తెలిపి మూడు నెలలుగా విక్రయాలు చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చాడు. తన తాత సిద్ధ వైద్యం నేర్పించాడని, ఆ నిబంధనల ప్రకారం ఔషధ మైసూర్‌ పాక్‌ తయారు చేస్తున్నట్లు, ఇది తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా తగ్గుతుందని తెలిపాడు. దీనికి సంబంధిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అది తెలుసుకున్న ఆహార, ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం స్వీట్‌ దుకాణ యజయాని వద్ద వివరాలు సేకరించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలా చేయడం తప్పని పేర్కొన్నారు. అనంతరం దుకాణానికి సీల్‌ వేశారు. మొత్తం 120 కిలోల మైసూర్‌ పాక్‌ను స్వాధీనం చేసుకున్నారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని