close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 04/04/2020 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

ముందే ఊహించాడు.. ప్రజల్ని రక్షిస్తున్నాడు

కరోనా పోరులో స్ఫూర్తిగా నిలుస్తున్న యువ కలెక్టర్‌

మహమ్మారి కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అలాగే కేరళలోని పథనంతిట్ట జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ కూడా గొప్ప పోరాటం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొవిడ్-19 ప్రమాదాన్ని ముందే ఊహించి శబరిమల ఆలయాన్ని మూసివేసి మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా ఆయన పోరాటాన్ని ఆపలేదు. కరోనా నిర్మూలన కోసం పోరాడుతున్నారు.

మహమ్మారి దేశంలో ప్రవేశించక ముందే దేశవ్యాప్తంగా నూహ్‌ తన సత్తా చాటిచెప్పారు. కలెక్టర్‌గా బాధ్యతలు అందుకున్నాక నువ్వు ఓడిపోతావ్‌ అని సమస్యలన్నీ ఆయనపై దండయాత్ర చేసినా.. వెనకడుగు వేయకుండా ఎదుర్కొని ప్రజల ప్రాణాలు రక్షించారు. జిల్లా కలెక్టర్‌గా నియమించిన కొద్దికాలానికే కేరళలో 2018లో ఘోరమైన వరదలు వచ్చాయి. దీంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అయితే ప్రజలను రక్షించడానికి అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌తో నూహ్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. కొన్ని గంటల్లోనే ఆయన సుమారు లక్షా 40 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఆ తర్వాత కొన్ని నెలలకే మరోసారి దేశం చూపు పథనంతిట్టపై పడింది. జిల్లాలో ఉన్న శబరిమల ఆలయ నిరసనలే దానికి కారణం. ఆలయంలో మహిళలకు ప్రవేశంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రవేశాన్ని అడ్డుకోవటానికి ఎంతో మంది తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో జిల్లా అంతా అట్టుడికింది. అయినా పరిస్థితులు చక్కదిద్ది ఆయన విజయవంతం అయ్యారు. ఇప్పుడు మరోసారి ప్రపంచ వినాశిని కరోనా పథనంతిట్టపై దాడి చేసింది. ఇటలీ నుంచి వచ్చిన ఓ కుటుంబం రాకతో మహమ్మారి మార్చి ప్రారంభంలోనే రాష్ట్రంలో ఆయన జిల్లానే మొదట పలకరించింది. అయినా సూక్ష్మజీవి వ్యాపించకుండా సమయస్ఫూర్తితో ఆయన కట్టడి చేస్తున్నారు.

కరోనా విపత్తును గ్రహించి యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. జిల్లాలోని శబరిమల ఆలయానికి వచ్చే భక్తుల్లో కరోనా బాధితుడు ఒక్కరు ఉన్నా.. రాష్ట్రమంతా విజృంభిస్తుందని గ్రహించారు. ప్రభుత్వంతో సంప్రదించి శబరిమలను తాత్కాలికంగా మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నూహ్‌పై సామాజిక మాధ్యమాల్లో భక్తులు తీవ్ర విమర్శలు చేశారు. అయితే కరోనా కట్టడి సమస్య ఇక్కడితో అంతమవ్వదని ఆయనికి తెలుసు. ఇటలీ నుంచి వచ్చిన ఆ కుటుంబం ఎక్కడెక్కడికి వెళ్లింది? ఎవరెవరిని కలుసుకుందో తెలుసుకోవడం ఆరంభించారు. బాధితులు కలుసుకున్న వారిని తెలుసుకోవడానికి ఫ్లో చార్ట్‌ను సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఫ్లో చార్ట్‌తో కరోనా వ్యాప్తిపై పోరాడిన తొలి జిల్లా పథనంతిట్టనే.

 ఆ కుటుంబం చర్చి, పోస్టాఫీసు, ఆభరణాల దుకాణం, మార్కెట్‌కు వెళ్లిందని తెలిసింది. దీంతో ఎంతో మంది ప్రజలకు కరోనా ముప్పు ఏర్పడింది. అయితే వెంటనే ఫ్లో చార్ట్‌ను ప్రజలకు తెలిసేలా చేశారు. కరోనా బాధితులు కలిసిన వారిని కనిపెట్టి ప్రమాద తీవ్రతను తగ్గించారు. అంతేకాక జియోఫెన్సింగ్‌ కూడా పథనంతిట్టనే తొలుత ప్రవేశపెట్టింది. క్వారంటైన్‌లో ఉన్న వారు బయటకు వెళ్లకుండా జియో ఫెన్సింగ్‌తో పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రతను తగ్గించారు. ‘‘కరోనాపై పోరాటంలో పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు, ఎన్జీవోలు, రాజకీయ నాయకులు గొప్ప పాత్ర పోషించారు. వారంతా ప్రజల్లో కరోనాపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మేం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. నిబంధనలను కఠినంగా అమలు చేశాం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మృదువుగా ఉంటే మహమ్మారిని అరికట్టలేం. అందుకే సత్ఫలితాలు వస్తున్నాయి’’ అని నూహ్‌ తెలిపారు. కేరళలో కరోనా బాధితులు 286 మంది ఉంటే ఈ జిల్లాలో 13 మంది మాత్రమే ఉన్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.