
తాజా వార్తలు
చివరి చూపునకు నోచుకోలేకపోయా..!
బాలు మృతి పట్ల ఏసుదాసు ఆవేదన
హైదరాబాద్: తన స్నేహితుడు, సోదర సమానుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడం పట్ల ప్రఖ్యాత గాయకుడు ఏసుదాసు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుతో కలిసి అనేక ఏళ్లు ప్రయాణం చేశానని, ఆయన సొంత సోదరుడి కంటే ఎక్కువని.. ప్రకటన విడుదల చేశారు. ‘నాతో కలిసి పనిచేస్తున్న వారందరిలోనూ బాలు నాకు చాలా దగ్గర. గత జన్మలో నేను, బాలు సొంత సోదరులం అనుకుంటా. బాలు సంగీతాన్ని సంప్రదాయబద్ధంగా నేర్చుకోకపోయినప్పటికీ.. ఈ రంగంలో ఆయన నైపుణ్యం అమోఘం. ఆయన పాడటమే కాదు.. చక్కగా కంపోజ్ చేస్తారు. ‘శంకరాభరణం’ సినిమా కోసం ఆయన పాడిన పాటలు అద్భుతం. సంగీతంలో శిక్షణ తీసుకున్న వాళ్లు కూడా అలా పాడలేరు’.
‘బాలు ఎప్పుడూ ఎవర్నీ బాధించలేదు. ప్రతి ఒక్కర్నీ ప్రేమగా పలకరించేవారు. ఆయన మా కోసం వంట చేసిన రోజులు కూడా ఉన్నాయి. సంగీత కార్యక్రమం కోసం ప్యారిస్ వెళ్లినప్పుడు మా బృందం కోసం బాలు ఎంతో రుచికరమైన వంటలు చేశారు. కరోనా వైరస్ వల్ల మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి భారత్‌కు రావడానికి అనుమతి ఇవ్వడం లేదు. బాలును చూడలేకపోయాను. ఆయన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని ఏసుదాసు తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.
నమ్మలేకున్నా: నయనతార
బాలు మృతి పట్ల నయనతార సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మన మధ్య లేరంటే నమ్మలేకపోతున్నానని ప్రకటన విడుదల చేశారు. బాలు గాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుందన్నారు. ఆయన ఎన్నో ఏళ్లుగా చిత్ర పరిశ్రమ కోసం శ్రమించారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తిండిపోతాయని పేర్కొన్నారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
