ఎన్డీయే, మహాకూటమి ఆధిక్యంలో పోటాపోటీ
close

తాజా వార్తలు

Published : 10/11/2020 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్డీయే, మహాకూటమి ఆధిక్యంలో పోటాపోటీ

పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి గంటలో లెక్కింపు సరళిని పరిశీలిస్తే .. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి.. అధికార ఎన్డీయే పోటాపోటీగా తలపడుతున్నాయి. హసన్‌పూర్‌లో ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, రాఘోపూర్‌లో ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్‌ ముందంజలో ఉన్నారు. అలాగే ఇమామ్‌గంజ్‌లో మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మాదేపురాలో పప్పు యాదవ్‌ వెనుకంజలో ఉన్నారు. జోకీపాట్‌లో ఎంఐఎం అబ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుండడం గమనార్హం.

ఉదయం 9:05 గంటల సమయంలో ఫలితాల సరళి ఇలా ఉంది..

 

రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభవగా.. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంలను తెరుస్తున్నారు. చాలా మేర ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌, ఆర్జేడీతో కూడిన ప్రతిపక్షకూటమి వైపే మొగ్గుచూపడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 243 శాసనసభ స్థానాలున్న బిహార్‌లో అధికారంలోకి రావాలంటే 122 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. 

అటు మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపూ కొనసాగుతుంది. తొలి గంట ఫలితాలు వెలువడిన తర్వాత భాజపా నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు గుజరాత్‌, యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు, బిహార్‌లో వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపూ కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని