close

తాజా వార్తలు

Published : 04/12/2020 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోస్టల్‌ ఓట్లలో భాజపాకు ఆధిక్యం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా..తొలుత పోస్టల్‌ ఓట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో భాజపాకు 85 డివిజన్లలో ఆధిక్యం లభించింది. తెరాస 29, ఎంఐఎం 17, కాంగ్రెస్‌ రెండు డివిజన్లలో ఆధిక్యం ప్రదర్శించాయి. మిగిలిన డివిజన్లలో ఎవరికీ ఆధిక్యం రాలేదు. గ్రేటర్‌ ఎన్నికల్లో 74లక్షల 67,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్లను బాక్సుల్లో నుంచి తీసి 25 బ్యాలెట్ల చొప్పున బండిల్‌గా కడుతున్నారు. అత్యంత తక్కువగా ఓట్లు పోలైన మెహిదీపట్నంలో మొదటి రౌండ్‌లోనే ఫలితం తేలనుంది. అత్యధికంగా ఓట్లు పోలైన మైలాన్‌దేవ్‌పల్లి డివిజన్‌తో పాటు మరో 11 డివిజన్లలో 3 రౌండ్లలో లెక్కింపు జరగనుంది.
 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని