IPL: మేమంటే.. మేమని
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL: మేమంటే.. మేమని

ఐపీఎల్‌ ఆతిథ్యం కోసం పోటీపడుతున్న దేశాలు

దిల్లీ: భారత్‌లో అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌-14ను నిర్వహించేందుకు ఇతర దేశాల క్రికెట్‌ బోర్డులు పోటీపడుతున్నాయి. మొత్తం 60 మ్యాచ్‌లకు గాను 29 మాత్రమే పూర్తవడంతో సీజన్‌ను తిరిగి నిర్వహించే సమయం, వేదిక గురించి బీసీసీఐ యోచిస్తోంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌నకు బీసీసీఐ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కాబట్టి అంతకంటే ముందే సెప్టెంబర్‌లో మిగిలిన ఐపీఎల్‌ సీజన్‌ను నిర్వహించే వీలుంది. అయితే అప్పుడు కూడా దేశంలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగితే లీగ్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌నూ ఇక్కడి నుంచి తరలించక తప్పని పరిస్థితి ఎదురుకానుంది.

మిగతా ఐపీఎల్‌ సీజన్‌ నిర్వహణ కోసం ఇప్పటివరకూ యూఏఈ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక రేసులో నిలిచాయి. ఒకవేళ పొట్టి ప్రపంచకప్‌ను తరలించాల్సి వస్తే.. బీసీసీఐ కచ్చితంగా యూఏఈలోనే ఆ టోర్నీని నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ కూడా అక్కడే జరిగే వీలుంది. గతేడాది సీజన్‌ను అక్కడే విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అలా అయితే ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత ఐపీఎల్, ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా నేరుగా యూఏఈ చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ ఇంగ్లాండ్‌లోనే జరపాలని భావిస్తే.. ఎలాగో భారత ఆటగాళ్లు అక్కడే ఉంటారు కాబట్టి మిగతా క్రికెటర్లను అక్కడికి తరలిస్తారు. కానీ యూఏఈతో పోలిస్తే ఇంగ్లాండ్‌లో లీగ్‌ నిర్వహణకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక ఆస్ట్రేలియా, శ్రీలంక ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బీసీసీఐ వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండ్‌ నుంచి భారత జట్టును, మిగతా అంతర్జాతీయ క్రికెటర్లను.. ఆ దేశాలకు తీసుకొచ్చి, మళ్లీ అక్కడి నుంచి టీ20 ప్రపంచకప్‌ కోసం యూఏఈకి తరలించడం తలనొప్పిగా మారనుంది. అయితే లీగ్‌ నిర్వహణకు ఈ దేశాలు ముందుకు రావడానికి ప్రధాన కారణం డబ్బు. గతేడాది లీగ్‌ నిర్వహించినందుకు ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డుకు బీసీసీఐ రూ.98.5 కోట్లు చెల్లించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న క్రికెట్‌ బోర్డులకు ఈ ఆదాయం కలిసొచ్చేదే. దీంతో పాటు ఇతర మార్గాల్లోనూ భారీగానే రాబడి ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని