
తాజా వార్తలు
గుంటూరులో కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్
నెలరోజుల్లో వెయ్యి మందికి టీకా
గుంటూరు: కొవిడ్-19 టీకా కొవాగ్జిన్‌పై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా వాలంటీర్లకు టీకాలు వేసే ప్రక్రియను గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేసీ ప్రశాంతి లాంఛనంగా ప్రారంభించారు. క్లినికల్ పరీక్షల్లో భాగంగా వెయ్యి మందికి టీకా వేయనున్నారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇవాళ వాలంటీర్‌గా వచ్చిన ఓ వ్యక్తికి టీకా వేశామని.. నెలరోజుల్లోగా వెయ్యి మందికి టీకా ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మొదటి డోసు ఇచ్చిన 28 రోజుల తర్వాత నెగెటివ్ వచ్చిన వారికి మరో డోసు ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రజలకు కరోనా నుంచి విముక్తి కలిగించే ప్రక్రియలో ఆసక్తి ఉన్నవారు ఈ ప్రక్రియలో పాల్గొనాలని ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధికారులు కోరారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
