close

తాజా వార్తలు

Updated : 31/07/2020 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ మరణాల్లో ఇటలీని దాటి 5వ స్థానానికి..!

35,747కు చేరిన మృతుల సంఖ్య
నిన్న ఒక్కరోజే 55,078 కేసులు, 779 మంది మృతి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీగా దాదాపు 50వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 55,078 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వరుసగా రెండోరోజూ 50వేలకుపైగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాటికి దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 16,38,870కు చేరింది. ఇక కొవిడ్‌ మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం దేశవ్యాప్తంగా దాదాపు 700లకుపైగా కొవిడ్‌ రోగులు మృత్యువాతపడుతున్నారు. గడిచిన 24గంటల్లో మరో 779 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 35,747కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 10లక్షల 57వేల మంది కోలుకున్నారు. మరో 5లక్షల 45వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.54శాతం ఉండగా, మరణాల రేటు 2.18శాతంగా ఉంది.

కొవిడ్‌  మరణాల్లో ప్రపంచంలోనే ఐదో స్థానానికి..
దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య కలవరపెడుతోంది. శుక్రవారం నాటికి దేశంలో 35,747 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానానికి చేరింది. 35,132 మరణాలతో ఇటలీ ఆరో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్‌, యూకే, మెక్సికో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం..
దేశం       మరణాల సంఖ్య    మరణాల రేటు(శాతంలో)
అమెరికా     1,52,040         3.5
బ్రెజిల్‌        91,263          3.6
బ్రిటన్‌        46,084         15.3
మెక్సికో       46,000         11.1    
భారత్‌        35,747         2.18
ఇటలీ        35,132          14.8


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని