ఫ్లూ కంటే కొవిడ్‌లో తక్కువ మ్యుటేషన్లే

తాజా వార్తలు

Published : 05/08/2020 00:26 IST

ఫ్లూ కంటే కొవిడ్‌లో తక్కువ మ్యుటేషన్లే

*గుర్తించిన శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌ : ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న వేళ.. దాన్ని నిరోధించే వ్యాక్సిన్ల పైనే మానవజాతి కోటి ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌కు కారణమైన SARS-CoV-2 వైరస్‌లో కనీసం ఆరు జాతులు ఉన్నప్పటికీ..  తక్కువ వైవిధ్యాన్నే చూపుతోందని తాజా అధ్యయనంలో గుర్తించారు. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేపడుతున్న శాస్త్రవేత్తలకు ఇది శుభవార్తే అని నిపుణులు చెబుతున్నారు.

‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ మైక్రోబయోలజీ’ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 48,635 కరోనా వైరస్‌ జన్యువులను విశ్లేషించి అత్యంత విస్తృతమైన అధ్యయనం చేశారు. అన్ని ఖండాలకు విస్తరిస్తున్న సమయంలో వైరస్‌ వ్యాప్తి, ఉత్పరివర్తనాలను ఇటలీలోని బొలోగ్నా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు మ్యాప్‌ చేశారు. నావల్‌ కరోనా వైరస్‌ తక్కువ వైవిధ్యాన్ని చూపిస్తోందని.. ఒక శాంపిల్‌కి దాదాపు ఏడు మ్యుటేషన్లను కలిగి ఉంటోందని గుర్తించారు. సాధారణ ఫ్లూలో ఇంతకంటే రెట్టింపు వైవిధ్యాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

‘దీనర్థం.. వ్యాక్సిన్‌తో సహా ప్రస్తుతం అభివృద్ధి చెస్తున్న చికిత్సా విధానాలు అన్ని వైరస్‌ జాతులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటాయని చెప్పొచ్చు’ అని ఈ అధ్యయన సమన్వయకర్త, బోలోగ్నా విశ్వవిద్యాలయ పరిశోధకుడు ఫెడరికో జార్జి వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని