
తాజా వార్తలు
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి: చాడ
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగిన వామపక్ష నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ నుంచి అదే ప్రాంతంలోని వివిధ బస్తీలు, కాలనీల్లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. హిమాయత్ నగర్ డివిజన్ సీపీఐ అభ్యర్థి ఛాయాదేవిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. గ్రేటర్లో ప్రశ్నించే గొంతుక కరవైందని.. ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక బస్తీలు నీటమునిగాయని.. తిండి లేక ఇంట్లో ఉన్న వస్తువులు పోగొట్టుకుని ప్రజలు రోడ్డున పడ్డారని చాడ ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో తాము ప్రజల్లోకి వెళుతున్నట్లు ఈ సందర్భంగా చాడ వివరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
