close
Array ( ) 1

తాజా వార్తలు

టీమ్‌ఇండియాకు ఆఫ్‌ స్పిన్నర్లు కావలెను!

రెండో స్థాయి స్పిన్నర్లను రూపొందించుకోవాలంటున్న మాజీలు

ముంబయి: టీమ్‌ఇండియా నాణ్యమైన టెస్టు స్పిన్నర్లను, ప్రత్యేకించి ఆఫ్‌బ్రేక్‌ బౌలర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ స్పిన్నర్లు అభిప్రాయపడుతున్నారు. ఉపఖండం పిచ్‌లపై ప్రభావం వికెట్లు తీస్తున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ (71 టెస్టుల్లో 365 వికెట్లు)ను విదేశీ పిచ్‌లపై ఆడించని సంగతి తెలిసిందే.

దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న అక్షయ్‌ వాఖరె (34 ఏళ్లు), జలజ్‌ సక్సేనా (33 ఏళ్లకు)కు అవకాశం ఇవ్వాలని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. అయితే మాజీ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ మాత్రం మరో అభిప్రాయంతో ఉన్నాడు. అశ్విన్‌కు మరో మూడేళ్లు టీమ్‌ఇండియాకు సేవలు అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ యువకులకు అవకాశం ఇస్తే మంచిదన్నాడు. ‘దేశవాళీ క్రికెట్లో, ఫ్లాట్‌ పిచ్‌లపై జలజ్‌, అక్షయ్‌ ఏటా అద్భుతంగా రాణిస్తున్నారు. ముంబయి ఇండియన్స్‌ నెట్స్‌లో నేను అక్షయ్‌ను చాలా దగ్గర్నుంచి చూశా. నా వరకైతే వయసు ఒక అంకె మాత్రమే. వారిద్దరికీ అవకాశమిచ్చి చూడొచ్చు’ అని భజ్జీ అందుకు బదులిచ్చాడు.

మరి రెండో స్థాయి ఆఫ్‌ స్పిన్నర్లను ఈ కాలంలో మనమెందుకు చూడటం లేదని ప్రశ్నించగా ‘రంజీ స్థాయిలో మంచి ఆఫ్‌ స్పిన్నర్‌ను నేను చూడలేదు. రంజీకి లేని సామర్థ్యం అదే. ఆఫ్‌స్పిన్నర్‌ను కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ దాడి చేస్తే సారథి అతడికి మళ్లీ బంతి ఇవ్వకపోతే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ప్రోత్సహించడం వల్లే హర్భజన్‌ గొప్ప స్పిన్నర్‌ అయ్యాడు’ అని లక్ష్మణ్‌ అన్నాడు. ‘జలజ్‌, అశ్విన్‌ కెరీర్లు సమాంతరంగా ఉన్నాయి. ప్రస్తుతం 33, 34 ఏళ్ల ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కష్టం. ఎందుకంటే ఫిట్‌నెస్‌ సమస్యగా మారుతుంది. కృష్ణప్ప గౌతమ్‌ బాగా ఆడతాడు కానీ టెస్టు క్రికెట్‌కు సరిపోతాడని అనుకోను’ అని ఆయన పేర్కొన్నారు.

‘మనకిప్పుడు భారత్‌-ఏ స్థాయిలో మంచి స్పిన్నర్ల బృందం అవసరం. మరో మూడేళ్లలో వారు సీనియర్‌ స్థాయికి సిద్ధంగా ఉండాలి. రాహుల్‌ చాహర్‌ యువకుడు. కానీ పరిమిత ఓవర్లకే సరిపోతాడు. షాబాజ్‌ నదీమ్‌ వయసు 30 దాటింది. యుజువేంద్ర చాహల్‌ ఈ మధ్యే 20 దాటాడు’ అని లక్ష్మణ్ అన్నారు. ‘అశ్విన్‌ అద్భుతమైన బౌలర్‌. ఎంతో వైవిధ్యం ఉంది. అయితే కొన్నిసార్లు వికెట్‌ తీసే బంతులేవో గుర్తించలేకపోతున్నాడు. జలజ్‌ స్పెషలిస్టు ఆఫ్‌స్పిన్నర్‌ అనుకోను. అతడు ఆల్‌రౌండర్‌ విభాగానికి చెందుతాడు’ అని మాజీ స్పిన్నర్‌ రాజేశ్‌ చౌహాన్‌ అన్నాడు.

‘అత్యున్నత స్థాయిలో మణికట్టు స్పిన్నర్లే అవసరమన్న దశకు చేరుకున్నాం. అందుకే జూనియర్‌ (అండర్‌-16, అండర్‌-19) స్థాయి కుర్రాళ్లు ఆఫ్‌స్పిన్నర్‌ అవ్వడం వల్ల లాభమేంటని అనుకుంటున్నారు. భవిష్యత్తులో వాఖరె, జలజ్‌ను ప్రయత్నించాలన్న భజ్జీతో నేను ఏకీభవిస్తా’ అని మాజీ వికెట్‌ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా అన్నాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.