
తాజా వార్తలు
అడిలైడ్‌లోనే తొలి టెస్టు..!
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చేనెల 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమయ్యే తొలి (డే/నైట్) టెస్టు అడిలైడ్‌లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల ఆరంభంలో అక్కడ కరోనా కేసులు పెరగడంతో వారం రోజుల పాటు కఠినంగా లాక్డౌన్ విధించారు. దీంతో తొలి టెస్టు నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానికి తోడు స్థానిక వైద్యాధికారి సైతం పింక్‌బాల్ టెస్టుపై సందేహం వెలిబుచ్చాడు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా అడిలైడ్‌కు బదులు తొలి టెస్టును సిడ్నీ లేదా మెల్బోర్న్లో నిర్వహించాలని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేశించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, శనివారం అర్ధరాత్రి నుంచి అడిలైడ్‌లో లాక్డౌన్ ఎత్తివేస్తుండడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు ఆశలు చిగురించాయి. అనుకున్నట్లే అక్కడ వైరస్ వ్యాప్తి అదుపులో ఉంటే షెడ్యూల్ ప్రకారమే తొలి టెస్టు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 13వ సీజన్ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు నేరుగా సిడ్నీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ 14 రోజుల క్వారంటైన్లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ తర్వాత బయోబుడగలోకి ప్రవేశించి ఆస్ట్రేలియా జట్టుతో 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనున్నారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- తాగడానికి తగని సమయముంటదా..!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- ఐసీయూలో భారత దిగ్గజ స్పిన్నర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
