close

తాజా వార్తలు

Updated : 15/08/2020 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రికెటర్ల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా క్రికెటర్లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. బీసీసీఐతో పాటు సెక్రటరీ జైషా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి, మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. త్రివర్ణ పతాకాలతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకొని హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే విషెస్‌ చెప్పారు. అలాగే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి కారణమైన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. మరోవైపు కరోనా పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ నిత్యం దేశ సేవలో నిమగ్నమైన సైనికులు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. 

ఈ గొప్ప దేశంలోని ప్రతీ పౌరుడికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. -బీసీసీఐ
ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి ముఖ్యకారణమైన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిద్దాం. మన త్రివర్ణ పతాకం ఎప్పుడూ సగర్వంగా మరింత ఎత్తులో రెపరెపలాడాలి. ఈ సందర్భంగా అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. -బీసీసీఐ కార్యదర్శి జైషా
ప్రతీ ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మనల్ని క్షేమంగా కాపాడుతూ కుటుంబాలకు దూరంగా పోరాడుతున్న సైనికులకు వందనం. -కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ
ఈ రోజు మనం 74వ స్వాత్రంత్య దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా మన స్వాతంత్ర్య సమరయోధులకు, వీర జవాన్లను గౌరవిద్దాం. మన దేశం ఏం చేయగలదనే దానిపైనే మన బలం ఉంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాటిపై కాదు. వోకల్‌ఫర్‌లోకల్‌. మేకిన్‌ఇండియా. జైహింద్‌. -కోచ్‌ రవిశాస్త్రి

టీమ్‌ఇండియా జెర్సీ ధరించడంతో వచ్చే గర్వం మరోదానిలో ఉండదు. హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే.   -మయాంక్‌ అగర్వాల్‌
అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నాకింకా గుర్తుంది. చిన్నప్పుడు ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లం. ఆరోజు పిల్లలందరూ ఉదయాన్నే నిద్రలేచి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవ్వడం. తర్వాత మిఠాయిలు తినడం. తర్వాత నేను ప్రాక్టీస్‌కు వెళ్లేవాడిని. మళ్లీ ఆ రోజు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుంచి దేశం విముక్తి పొందాలి. అందరూ తమ వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఒకరికి ఒకరు సాయం చేసుకొని ఇంట్లోనే ఉండండి. - అజింక్య రహానె

స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛను ఆస్వాదించడమే. అలాగే ఇతరులు చేసేదాన్ని కూడా ప్రోత్సహించడం. మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానీయులకు కృతజ్ఞతలు. ఆ దేవుడు ఈ దేశాన్ని చల్లగా చూడాలి. -వీరేందర్‌ సెహ్వాగ్‌

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. -హర్భజన్‌ సింగ్‌

దేశం కోసం ఆడటం నాకు గర్వకారణం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. -శిఖర్‌ ధావన్‌


 


Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని