చిట్టీల పేరుతో రూ.4.5 కోట్లకు టోపీ!
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 08:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిట్టీల పేరుతో రూ.4.5 కోట్లకు టోపీ!

హయత్‌నగర్‌ ఠాణా చెంత బాధితులు

హయత్‌నగర్‌ న్యూస్‌టుడే: చిట్టీల పేరుతో ఓ మహిళ రూ.4.5 కోట్లకు టోకరా వేసింది. సుమారు 70 మంది బాధితులు ఆదివారం హయత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. హయత్‌నగర్‌ పరిధి ప్రగతినగర్‌కు చెందిన సప్పిడి పూలమ్మ కొన్నేళ్లుగా చిట్టీలు నడుపుతోంది. స్థానికంగా సొంత ఇల్లు ఉంది. నలుగురితో కలివిడిగా ఉండటంతో ప్రగతి నగర్‌, ప్రియదర్శిని నగర్‌ కాలనీ, పీఎస్‌ఆర్‌ కాలనీలకు చెందిన పలువురు ఆమె వద్ద చిట్టీలు కట్టారు. నెలనెలా వడ్డీ చెల్లిస్తానని. గడువు ముగిసిన చిట్టీ డబ్బులు తానే తీసుకునేది. పలువురి వద్ద అందిన కాడికి అప్పులు చేసింది. చిట్టీలు ఎత్తినవారికి, అప్పులవారికి డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. శనివారం తన సామగ్రితో వెళ్లిపోవడంతో.. ఆదివారం ఆమె ఇంటికెళ్లి ఆందోళనకు దిగారు. తనకు సంబంధం లేదని కుమారుడు చెప్పడంతో, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని