శ్రీనగర్‌లో రేపు, ఎల్లుండి కర్ఫ్యూ
close

తాజా వార్తలు

Published : 03/08/2020 23:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీనగర్‌లో రేపు, ఎల్లుండి కర్ఫ్యూ

 

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌  370 రద్దయిపోయి ఆగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆ రోజును బ్లాక్‌ డేగా పాటించాలని పీడీపీ పిలుపునిచ్చింది. జమ్ముకశ్మీర్‌ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో అల్లర్లు జరిగేందుకు అవకాశమున్నందున ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. మంగళ, బుధవారాల్లో శ్రీనగర్‌లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. మరోవైపు  కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా అమల్లో ఉన్న నిబంధలను ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని