కరోనా వ్యాక్సిన్‌: భారత్‌బయోటెక్‌ కీలక అడుగు
close

తాజా వార్తలు

Updated : 29/06/2020 22:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వ్యాక్సిన్‌: భారత్‌బయోటెక్‌ కీలక అడుగు

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ బయోటెక్‌ మరో ముందడుగు వేసింది. కరోనా కట్టడికి ఈ సంస్థ తయారు చేస్తున్న ‘కోవ్యాక్సిన్‌’ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతిచ్చింది. మానవులపై ఫేజ్‌ -1, ఫేజ్‌ -2 పరీక్షలకు అనుమతులు జారీ చేసింది. కొవిడ్‌ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. జులై నెల నుంచి మానవులపై ప్రయోగాలు చేయనుంది. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ‘కోవ్యాక్సిన్‌’ తయారీ చరిత్రాత్మకం అవుతుందన్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని