డీగో.. నీ టాలెంట్ సూపర్‌.. వీడియో వైరల్‌
close

తాజా వార్తలు

Updated : 04/11/2020 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డీగో.. నీ టాలెంట్ సూపర్‌.. వీడియో వైరల్‌

ఇంటర్నెట్ డెస్క్‌: చూసేందుకు ఆయనేమీ ఆజానుబావుడు కాదు. భారీగా శారీరక ధారుడ్యం కలిగినవాడూ కాదు. అయితేనేమీ ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు తన ఫుట్‌బాల్‌ ఆటతో. ఆయనే అర్జెంటీనాకు చెందిన డీగో అర్మాండో మారడోనా..  ప్రతి ఫుట్‌బాల్‌ అభిమానికి డీగో పేరు తెలియకుండా ఉండదు. అప్పట్లో మారడోనా మైదానంలోకి దిగాడంటే ఒకటే అరుపులు. ప్రత్యర్థులకు అందకుండా గోల్‌ కొట్టడంలో ఎంతో నైపుణ్యం కలిగిన దిగ్గజ ఆటగాడు. నాలుగు రోజుల కిందట(అక్టోబర్‌ 30న) డీగో మారడోనా ఆరు పదుల వయసులోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా 1989వ సంవత్సరంలో మారడోనా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. బంతిని ఎంతో నేర్పుగా ఒడిసి పడుతున్న వైనం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను మీరూ ఓసారి చూసి ఆనందించండి..Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని