close

తాజా వార్తలు

Updated : 23/11/2020 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయంపై విశ్వాసం పెరుగుతోంది: డీకే అరుణ

హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందన్న విశ్వాసం రోజు రోజుకూ పెరుగుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రెండు నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మజ్లీస్‌ చెబుతోందని, అది వినడానికి ఎవరూ చెవిలో పువ్వులు పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. కేవలం ఓట్ల కోసమే మజ్లిస్‌తో  పొత్తు పెట్టుకొని ముస్లింలను  కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2016 మేనిఫెస్టోలోని అంశాలనే 2020లో తెరాస చేర్చిందని ఆమె తెలిపారు. 2016 మేనిఫెస్టోలో పేర్కొన్న ఎన్ని హామీలను నెరవేర్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

హైదరాబాద్‌ను కొడుకు కేటీఆర్ చేతిలో పెట్టారు తప్ప ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తండ్రి, కొడుకులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. భాజపా పాలిత పట్టణాల అభివృద్ధిని చూసొద్దాం వస్తారా? అని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. పాతనగరంలా హైదరాబాద్ కావద్దు అంటే భాజపాను గెలిపించాలని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి తాను వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈ సందర్భంగా  పాలమూరు విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు డీకే అరుణ సమక్షంలో భాజపాలో చేరారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని