close

తాజా వార్తలు

Published : 22/11/2020 11:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్లీజ్‌ నా ఫొటోలు తొలగించండి..!

అభిమానులకు నటి విన్నపం

ముంబయి: తన ఫొటోలను సోషల్‌మీడియా ఖాతాల నుంచి తొలగించాలని దంగల్‌ నటి జైరా వాసీం అభిమానులకు విన్నపం చేశారు. జీవితంలో తాను కొత్త అంకానికి శ్రీకారం చుట్టనున్నానని.. దానికి అభిమానులు, నెటిజన్లు సాయం చేయాలని ఆమె కోరారు.

‘హాయ్‌!! మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నాను. ప్రతి పనిలోనూ నాకెంతగానో సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు నాపై కురిపిస్తున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని అందర్నీ ఓ సాయం అడుగుతున్నాను. దయచేసి మీ  సోషల్‌మీడియా ఖాతాల నుంచి నా ఫొటోలను తొలగించాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్యాన్‌ పేజీలకు కూడా ఈ విషయాన్ని తెలియజేయగలరు. ఇంటర్నెట్‌ నుంచి అన్ని  ఫొటోలు తొలగించడం సాధ్యం కాదని నాకు తెలుసు.. కాబట్టి, ఇకపై నా ఫొటోలను దయచేసి షేర్‌ చేయకండి. ఇప్పటివరకూ అన్నివిధాలుగా సపోర్ట్‌ చేసినట్టుగానే.. ఈ విషయంలో కూడా మీ సహకారం నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. మీరు చేసే ఈ సాయం వల్ల ప్రయోజనం పొందగలననుకుంటున్నాను’ అని జైరావాసీం వివరించారు.

ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్‌’ చిత్రంలో జైరా వాసీం నటించారు. ప్రముఖ మల్లయోధుడు మహవీర్‌సింగ్ పొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2016లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో గీతా పొగట్‌ చిన్నప్పటి పాత్రలో జైరా వాసీం నటించి మెప్పించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన