సోషల్‌ మీడియా దిగ్గజాల్లో డేటా లీక్‌..
close

తాజా వార్తలు

Published : 21/08/2020 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ మీడియా దిగ్గజాల్లో డేటా లీక్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌ మీడియా దిగ్గజాలైన ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, యూట్యూబ్‌లో భారీగా వినియోగదారుల వ్యక్తిగత డేటా డార్క్‌వెబ్‌లో లీకైనట్లు కామ్‌పారిటెక్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. దీని ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అత్యధికంగా 100 మిలియన్లకు పైగా డేటా రెండు విడతలగా లీకైంది. మూడోసారి టిక్‌ టాక్‌ నుంచి 42 మిలియన్లు, యూట్యూబ్‌ నుంచి 4 మిలియన్ల చొప్పున డేటా పోయింది. వీటిల్లో ఐదింట ఒకటో వంతు వినియోగదారుల ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లు , ప్రొఫైల్‌ ఫొటోలు వంటివి ఉన్నట్లు పేర్కొంది. 

సైబర్‌ క్రిమినల్స్‌, స్పామర్స్‌కు ఇవి ఉపయోగపడతాయని ఆ వెబ్‌సైట్‌ ఎడిటర్‌ పౌల్‌ బిస్చెఫ్‌ పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో షైనీ హంటర్స్‌ అనే హ్యాకర్స్‌ గ్రూప్‌ 18 కంపెనీలకు చెందిన 386 మిలియన్ల మంది డేటాను తస్కరించింది. వీటిని ఎవరైనా ప్రీగా తీసుకొనేట్లు ఒక ఫోరంలో అప్‌లోడ్‌ చేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని