విలియమ్సన్‌ హైదరాబాద్‌తోనే..!
close

తాజా వార్తలు

Updated : 25/12/2020 10:16 IST

విలియమ్సన్‌ హైదరాబాద్‌తోనే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ వచ్చే ఏడాది వేరే జట్టుకు వెళ్తాడనే ఊహాగానాలపై ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పష్టత ఇచ్చాడు. విలియమ్సన్‌ ఎక్కడికీ పోడని చెప్పాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తి అయినప్పటి నుంచి విలియమ్సన్‌ హైదరాబాద్‌ టీమ్‌ను వీడిపోతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు వార్నర్‌ సమాధానమిచ్చాడు. ఇది తాను మొదటిసారి వింటున్నానని, కేన్‌ ఎక్కడికీ పోడని వివరించాడు. దీంతో హైదరాబాద్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్‌ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి టాప్‌ మూడులో నిలిచిన సంగతి తెలిసిందే. తుదిపోరుకు ముందు క్వాలిఫయర్‌-2లో దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు విలియమ్సన్‌ గాయం కారణంగా సీజన్‌ ఆరంభంలో పలు మ్యాచ్‌లు ఆడలేదు. ఆపై జట్టులోకి వచ్చి కీలక సమయాల్లో రాణించాడు. ఈ సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్‌ 3 అర్ధశతకాలతో 317 పరుగులు చేశాడు. మరోవైపు వార్నర్‌ 16 మ్యాచ్‌ల్లో 4 అర్ధశతకాలతో 548 పరుగులు చేశాడు. కాగా, విలియమ్సన్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతుండగా, వార్నర్‌ టీమ్‌ఇండియాతో తలపడనున్నాడు. అతడిప్పుడు గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..
భారత్‌కు బాక్సింగ్‌ పరీక్ష
10 జట్లతో 2022 ఐపీఎల్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని