ఆప్‌, కాంగ్రెస్‌పై భాజపా బాణాలు
close

తాజా వార్తలు

Published : 25/01/2020 00:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆప్‌, కాంగ్రెస్‌పై భాజపా బాణాలు

దిల్లీ: హస్తినలో అసెంబ్లీ సమరానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీలు విమర్శల వాడి పెంచుతున్నాయి. దిల్లీ ఎన్నికలను భారత్‌-పాకిస్థాన్‌ వివాదంతో పోల్చినందుకుగాను భాజపా నేత కపిల్‌ మిశ్రాకు దిల్లీ ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ కూడా ప్రతిపక్షాలపై నేరుగా విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల వెనక కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీల హస్తముందని ఆరోపించారు. అక్కడ ‘జిన్నా వాలీ ఆజాదీ’ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయని, ప్రజలు జిన్నా వాలీ ఆజాదీ అంటారో.. భారత్‌ మాతాకీ జై అంటూ నినదిస్తారో తేల్చుకోవాలని దిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి  మనీశ్‌ సిసోడియా మాటలను బట్టి చూస్తే షాహిన్‌ బాగ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని అర్థమవుతోందని జావడేకర్‌ విమర్శించారు. వారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దిల్లీలోని షాహీన్‌ బాగ్ ప్రాంతంలో వీటి తీవ్రత అధికంగా ఉంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని