close

తాజా వార్తలు

Published : 06/09/2020 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సురేశ్‌ రైనా మళ్లీ వచ్చి కచ్చితంగా ఆడతాడు!

చెన్నై అలా చేయకపోతే ఆశ్చర్యం లేదు: దీప్‌దాస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా మళ్లీ వచ్చి కచ్చితంగా ఆడతాడని, అయితే ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని టీమ్‌ఇండియా మాజీ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా అభిప్రాయపడ్డాడు. గతవారం సీఎస్కే జట్టులో నుంచి సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు ఆడటం లేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి స్థానాలను భర్తీ చేసే విషయంపై స్పందించిన దీప్‌దాస్‌ పైవిధంగా మాట్లాడాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో కథనం ప్రకారం.. ‘ఐపీఎల్‌లో రైనా మళ్లీ ఆడతాడనే నమ్మకం నాకుంది. ఐపీఎల్‌ నియమాలు, క్వారంటైన్‌లో ఉండటం, కరోనా పరీక్షలు చేయించుకోవడం లాంటివాటితో మొదట్లో కొన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. అయితే, తర్వాత మాత్రం ఆడతాడని విశ్వసిస్తున్నా. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌ అతడి స్థానాన్ని వేరే ఆటగాడితో భర్తీ చేయకపోయినా నేను ఆశ్చర్యపోను’ అని పేర్కొన్నాడు. 

ఇక సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ నిష్క్రమణపై స్పందిస్తూ.. అతడి స్థానాన్ని భర్తీ చేయడంలో సీఎస్కేకు ఎక్కువ అవకాశాలు లేవన్నాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న జలజ్‌ సక్సేనా అనే యువ ఆల్‌రౌండర్‌ను తీసుకుంటే సరిగ్గా సరిపోతాడని దీప్‌దాస్‌ తెలిపాడు. ధోనీ జట్టు అతడిని పరిశీలించే అవకాశం ఉందని, భజ్జీ స్థానాన్ని భర్తీ చేయగలడని ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, చెన్నై జట్టులో కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది ఇతర సహాయక సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. గత సోమవారం వారికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చినప్పటికీ 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచారు. ఆ సమయం గడిచాక మరోసారి నిర్ధరణ పరీక్షలు చేసి అప్పుడు కూడా నెగిటివ్‌ వస్తేనే వారిని జట్టుతో కలవనిస్తారు. అంత వరకూ ఆ 13 మంది ఐసోలేషన్‌లోనే ఉండాలి. మరోవైపు మిగతా ఆటగాళ్లందరికీ మూడు రోజుల క్రితం చేసిన పరీక్షల్లో నెగిటివ్‌గా రావడంతో వారందరూ తాజాగా  ప్రాక్టీస్‌ చేసుకునేందుకు వీలు కల్పించారు. దీంతో కెప్టెన్‌ ధోనీతో సహా అంతా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని