close

తాజా వార్తలు

Updated : 12/07/2020 20:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బర్త్‌డే కేక్‌ దీపిక వారమంతా తింటే... 

ముంబయి: సెలబ్రిటీలు తాము చేసే సరదా వీడియోలను, పోస్టులను అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల్లో ఉంచుతుంటారు. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే జంట మాత్రం సోషల్‌ మీడియాలో తరచూ తమ అభిప్రాయాలను చెబుతుంటుంది. గత వారమే (జులై 6న) రణ్‌వీర్‌ తన 35వ జన్మదినం జరుపుకున్నాడు. వీకెండ్‌ సందర్భంగా దీపికా పదుకొనే సరదా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. వారమంతా పుట్టిన రోజు కేక్‌ తింటే తన రియాక్షన్‌ ఎలా ఉంటుందో వీడియో పెట్టింది. వీడియోకు ‘బర్త్‌డే కేక్‌ వారమంతా తింటూ ఉంటే ఎలా ఉంటుందో నాకు నేను చెక్‌ చేసుకుంటున్నా’’ అనే వ్యాఖ్యను జోడించింది. 

కరోనాతో ఇప్పటి వరకు షూటింగ్‌ లేకపోవడంతో ఎంచక్కా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోందీ జంట. కపిల్‌ బయోపిక్‌ ‘83’లో రణ్‌వీర్‌, దీపిక నటిస్తున్నారు. తర్వాత శకున్‌ బాత్రా దర్శకత్వంలో దీపిక నటించే సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘ద ఇంటెర్న్’‌ రీమేక్‌కు దీపికా పదుకొనే ఇప్పటికే సైన్‌ చేసింది. రిషీకపూర్‌ మరణించడంతో ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది.

 




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని