దిల్లీలో ప్రపంచంలోనే పెద్ద కొవిడ్‌ సెంటర్‌
close

తాజా వార్తలు

Updated : 05/07/2020 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో ప్రపంచంలోనే పెద్ద కొవిడ్‌ సెంటర్‌

ప్రారంభించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా పిలుస్తున్న దీన్ని ఆదివారం ఉదయం లెఫ్టినెంట్‌ గర్నర్‌ అనిల్‌ బైజల్‌ ప్రారంభించారు. 10వేల పడకలతో దీన్ని ఏర్పాటు చేశారు. నోడల్‌ ఏజెన్సీగా ఆస్పత్రిని ఐటీబీపీ నిర్వహిస్తోంది. రాధా సోమి బియాస్‌ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన కొంతమంది స్వచ్ఛందంగా సేవలందించనున్నారు. ఛత్తర్‌పూర్‌లో 70ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 20 ఫుట్‌బాల్‌ మైదానాలకు సమానంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలు లేనివారికి ఇక్కడ చికిత్స అందించనున్నారు. ఐటీబీపీ, ఇతర కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 1,000 మందికి పైగా డాక్టర్లు, 2,000 మంది వైద్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని