close

తాజా వార్తలు

Published : 20/11/2020 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీ నుంచి ముంబయికి విమానాలు బంద్‌!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో రాకపోకలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దిల్లీ నుంచి ముంబయికి వచ్చే విమానాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపివేయాలని చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. 

ఇదిలా ఉండగా..అక్టోబర్ 28 నుంచి దిల్లీలో కరోనా కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపించింది. నవంబర్‌ 11న 8వేల మార్కును దాటి ఆందోళనకు గురిచేసింది. అలాగే గడిచిన 24 గంటల్లో 7,500 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలకు ఉపక్రమించింది. వివాహ వేడుకల వంటి శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతించడం, మాస్క్‌ ధరించని వారికి రూ.2,000 జరిమానా విధించడం వంటి చర్యలకు పూనుకుంది. ఇక, కొవిడ్-19 కేసులు అధిక సంఖ్యలో వెలుగుచూస్తోన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపే యోచనలో ఉన్నట్లు శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వెలుగులోకిరాని కేసులను గుర్తించేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాలకు సూచించింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన