close

తాజా వార్తలు

Published : 19/11/2020 22:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

22శాతం మరణాలు దిల్లీలోనే..!

రోజువారీ కేసులు, మరణాల్లో దేశ రాజధాని టాప్‌

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్‌ తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిత్యం వందకుపైగా కరోనా రోగులు మృత్యువాతపడుతున్నారు. గడిచిన 24గంటల్లోనే అత్యధికంగా మరో 131 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నిన్న సంభవించిన మొత్తం కరోనా మరణాల్లో 22.36శాతం దిల్లీలోనే చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీగా కొత్తగా నమోదవుతున్న కేసుల్లోనూ దిల్లీ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది.

కరోనా ధాటికి దిల్లీ నగరం వణికిపోతూనే ఉంది. నిత్యం దాదాపు 7వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 7486 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5లక్షలకు చేరింది. ఒక్కరోజే అత్యధికంగా 131 ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారిసంఖ్య 7943కు చేరింది. దిల్లీ అనంతరం ఎక్కువ కేసులు కేరళ, మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.

ఆ పది రాష్ట్రాల్లోనే 80శాతం మరణాలు..
దేశవ్యాప్తంగా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారిసంఖ్య పదిరాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 80శాతం మరణాలు ఈ పది రాష్ట్రాల్లోనే చోటుచేసుకుంటున్నట్లు పేర్కొంది. దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదిలాఉంటే, దేశంలో ఇప్పటివరకు 89లక్షల 58వేల మందికి వైరస్‌ సోకగా, వీరిలో ఇప్పటికే లక్షా 31వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతిరోజు దాదాపు 500లకు పైగా కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని