
తాజా వార్తలు
దిల్లీ ప్రజలందరికీ టీకా పంపిణీ చేస్తాం: జైన్
దిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వీలైనంత తొందరగా దిల్లీ ప్రజలందరికీ పంపిణీ చేస్తామని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత మూడు లేదా నాలుగు వారాల్లో దిల్లీ ప్రజలందరికీ పంపిణీ పూర్తి చేస్తాం. రాజధానిలో వ్యాక్సిన్ నిల్వ, సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. దిల్లీలో కొవిడ్ కేసుల పాజిటివిట్ రేటు నవంబర్ 7వ తేదీన 15 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 8.51 శాతానికి తగ్గింది. ఇది ఉపశమనం కలిగిస్తోంది. రాజధానిలోని ఆస్పత్రుల్లో ప్రస్తుతం 50శాతం బెడ్లు ఖాళీగానే ఉన్నాయి. మరో 1200 ఐసీయూ పడకలు కూడా అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన సమస్య ఏర్పడింది. కానీ వెంటనే సమస్యను పరిష్కరించాం. శుక్రవారం దిల్లీలో 5వేలకు పైగా కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి’ అని తెలిపారు. అనంతరం రైతుల నిరసనల గురించి ప్రశ్నించగా.. ‘రైతులు శాంతియుతంగా తమ నిరసనల్ని తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి నిరసనలను కొనసాగించేందుకు అనుమతించాలి’ అని పేర్కొన్నారు. కాగా, దిల్లీలో గడిచిన 24గంటల్లో 98 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం అక్కడ 38వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
