close
Array ( ) 1

తాజా వార్తలు

ఆ వినతిపత్రంలో ఏముందో జగన్‌ చెప్పాలి?

తెదేపా నేత దేవినేని డిమాండ్‌

అమరావతి: దిల్లీ పర్యటనలో ఏం మాట్లాడారో కూడా చెప్పలేనిస్థితిలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మోదీ, అమిత్‌ షాతో ఏం మాట్లాడారో చెప్పలేని నిస్సహాయ స్థితి ఈ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. దిల్లీ పెద్దలకు ఇచ్చిన వినతి పత్రంలో ఏముందో సీఎం జగన్‌ చెప్పాలన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే మంత్రులతో ప్రకటన చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని విమర్శించారు. రైతులు రోడ్డున పడితే వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు ఏం చేస్తున్నారని దేవినేని నిలదీశారు. సుబాబుల్‌, మిర్చి రైతులను దోపిడీ చేస్తున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.