close

తాజా వార్తలు

Published : 01/11/2020 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కచ్చితంగా ఇది నా ఆఖరి సీజన్‌ కాదు: ధోనీ

స్పష్టం చేసిన చెన్నై కెప్టెన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో చెన్నై టీమ్‌ తరఫున ఇదే తన చివరి సీజనా? అని అడిగిన ప్రశ్నకు ఆ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ స్పష్టతనిచ్చాడు. కచ్చితంగా కాదని జవాబిచ్చాడు. దీంతో చెన్నై అభిమానులకు సంతోషకరమైన వార్త చెప్పాడు. కరోనా కారణంగా ఈ ఏడాది యూఏఈలో జరుగుతున్న మెగా టోర్నీలో చెన్నై దారుణంగా విఫలమైంది. ఎన్నడూ లేని విధంగా ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించనుంది. ప్రస్తుతం పంజాబ్‌తో తలపడుతున్న సందర్భంగా టాస్‌ వేసే సమయంలో వ్యాఖ్యాత డానీ మోరీసన్‌ అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చాడు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా గతేడాది వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 

అనంతరం ఏడాదికిపై ఆటకు దూరమైన మహీ ఆగస్టు 15న అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ సీజన్‌ కోసం చెన్నైలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్న వేళ ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. దీంతో ధోనీ అభిమానులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనంతరం చెన్నై జట్టు యూఈఏకి చేరుకోగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇద్దరు ఆటగాళ్లు, పలువురు సిబ్బంది కరోనాబారిన పడ్డారు. ఈ క్రమంలోనే రైనా, భజ్జీ వంటి సీనియర్లు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు. ఆపై చెన్నై వరుస ఓటములు చవిచూసింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. అయితే, చెన్నై ఈసారి విఫలమవడంతో ధోనీ మళ్లీ ఈ లీగ్‌ నుంచి కూడా తప్పుకొంటాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటిని కొట్టిపారేస్తూ ధోనీ తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని