close

తాజా వార్తలు

Updated : 25/10/2020 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీ జెర్సీలిస్తున్నాడు.. ఇదే ఆఖరి సీజనా?

సామాజిక మాధ్యమాల్లో అభిమానుల ఆందోళన

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆగస్టు 15న టీమ్‌ఇండియా క్రికెటర్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించిన మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ త్వరలోనే టీ20 మెగా లీగ్‌ నుంచి కూడా తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం తన జెర్సీని జోస్‌బట్లర్‌కు బహుమతిగా ఇచ్చిన ధోనీ.. శుక్రవారం రాత్రి ముంబయితో మ్యాచ్‌ అనంతరం పాండ్య బ్రదర్స్‌కు కూడా అలాగే చేశాడు. తన 7వ నంబర్‌ జెర్సీని  బహూకరించాడు. ఈ ఫొటోను లీగ్‌ నిర్వహకులు తమ ట్విటర్‌లో పోస్టు చేయగా పలువురు అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు ధోనీ ఆటోగ్రాఫ్‌లు, జెర్సీలు తీసుకోవడం చూస్తుంటే.. బహుశా చెన్నై సారథికి ఇదే ఆఖరి సీజన్‌ కావచ్చునేమో అంటూ సందేహాత్మకంగా ట్వీట్లు చేస్తున్నారు.

అయితే, మరో కారణం కూడా కనిపిస్తోంది. చెన్నై ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోర పరాభవాలతో అనూహ్యంగా నిష్క్రమించనుంది. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేని పరిస్థితిలో వైదొలగనుంది. ఇప్పటికే ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 3 మాత్రమే గెలిచి 8 మ్యాచ్‌లు ఓటమిపాలైంది. దానికి తోడు కెప్టెన్‌ ధోనీ సైతం ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్నాడు. వీటన్నింటినీ గమనించి త్వరలోనే అతడు ఈ లీగ్‌ నుంచి కూడా తప్పుకుంటాడనే అనుమానం రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే అతడి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ధోనీ ఈ లీగ్‌ తర్వాత బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అదెంత వరకూ నిజమో తెలియదు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని