close

తాజా వార్తలు

Updated : 24/10/2020 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాధగా ఉంది.. తప్పెక్కడో గుర్తించాలి

చెన్నై వైఫల్యంపై కెప్టెన్‌ ధోనీ స్పందన

ఇంటర్నెట్‌డెస్క్‌: 2020 సీజన్‌లో చెన్నై కథ ముగిసింది. ముంబయితో గత రాత్రి తలపడిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం చవిచూసింది. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తమ ప్రదర్శన పట్ల బాధగా ఉందన్నాడు. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఈ ఏడాది తమది కాదని.. ఒకటి, రెండు మ్యాచ్‌ల్లోనే తాము సమష్టిగా రాణించామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో పది వికెట్లతో ఓడామా, ఎనిమిది వికెట్లతో ఓడామా అనేది ప్రాధాన్యం కాదని, ప్రతీ ఒక్కరూ బాధపడుతున్నా విశ్వ ప్రయత్నం చేస్తున్నారని తెలిపాడు. 

‘ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేస్తామనే విశ్వాసం ఉంది. రాయుడికి గాయమైంది. మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమవుతున్నారు. దాంతో వాళ్లపై ఒత్తిడి పెరిగింది. ఎప్పుడైనా టాప్‌ఆర్డర్‌ మంచి ఆరంభం ఇవ్వకపోతే అది మిడిల్‌ ఆర్డర్‌పై ప్రభావం చూపుతుంది. అలాగే క్రికెట్‌లో వైఫల్యాలు ఎదురౌతుంటే కాస్త అదృష్టం కూడా కలిసిరావాలి. కానీ ఈ టోర్నీలో మాకు అలా జరగలేదు. మేం టాస్‌లు గెలవలేదు. దాంతో కొన్నిసార్లు రెండో ఇన్నింగ్స్‌లో ఆడాల్సి వచ్చింది. అప్పుడు తేమ కూడా ప్రభావం చూపలేకపోయింది. మేం తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు మాత్రం అనూహ్యంగా తేమ ప్రభావం చూపించింది. ఇలా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని సమీక్షించుకోవాలి. మనం ఎప్పుడైనా సరిగ్గా ఆడనప్పుడే వంద కారణాలు కనిపిస్తాయి. అయితే, సామర్థ్యం మేరకు రాణిస్తున్నామా లేదా అనేదే ఆటగాళ్లు స్వతహాగా ప్రశ్నించుకోవాలి’ అని ధోనీ పేర్కొన్నాడు. 

‘అలాగే తుది జట్టులో ఉండే ఆటగాళ్లు మైదానంలో వాళ్ల స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నారా లేదా అనేది జట్టు చూసుకోవాలి. దాన్ని ఈ ఏడాది మేం చేయలేకపోయాం. ముగ్గురు నలుగురు బ్యాట్స్‌మన్‌ రాణించకపోతే అది ఇబ్బందిగా ఉంటుంది. కానీ అవన్నీ ఆటలో భాగమేనని నేను భావిస్తా. ఒకవేళ మనం బాధపడుతున్నా చిరునవ్వుతో ఉండాలి. లేదంటే మనం భయపడుతున్నామని యాజమాన్యం భావిస్తుంది. ఆ విషయంలో మా ఆటగాళ్లు బాగానే మెలిగారు. ఇక గౌరవం కోసమైనా మిగతా మూడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. దాంతో పాటే వచ్చే ఏడాదికి సంబంధించి పూర్తి అవగాహనతో ఉండాలి. కుర్రాళ్లకి అవకాశం ఇచ్చి తర్వాతి సీజన్‌ కోసం వాళ్లని సన్నద్ధం చేయాలి. సరైన బ్యాట్స్‌మెన్‌, బౌలర్లను గుర్తించాలి. కెప్టెన్‌ అనేవాడు తప్పించుకొని వెళ్లకూడదు కాబట్టి.. మిగతా మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా ఆడతా’ అని ధోనీ వివరించాడు. Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని