టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీ
close

తాజా వార్తలు

Updated : 19/10/2020 19:14 IST

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీ

ఇంటర్నెట్‌డెస్క్‌: అబుదాబి వేదికగా చెన్నై, రాజస్థాన్‌ జట్లు మరికొద్దిసేపట్లో తమ పదో మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఈ రెండు జట్లు ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడేసి విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. దీంతో ఎలాగైనా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. కాగా, ఈ సీజన్‌లో ఇంతకుముందు తలపడిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్‌ 16 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

చెన్నై జట్టు: సామ్‌కరన్‌, డుప్లెసిస్‌, షేన్‌వాట్సన్‌, అంబటి రాయుడు, మహేంద్రసింగ్‌ ధోనీ(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, కేదార్‌ జాదవ్‌, పీయూష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకుర్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌

రాజస్థాన్‌ జట్టు: రాబిన్‌ ఉతప్ప, బెన్‌స్టోక్స్‌, సంజూ శాంసన్‌, స్టీవ్‌స్మిత్‌(కెప్టెన్‌), జోస్‌బట్లర్‌, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, శ్రేయస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, కార్తీక్‌ త్యాగి.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని