
తాజా వార్తలు
కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం.. ఇదొక ఆట మాత్రమే!
ప్లేఆఫ్స్ కోల్పోయిన చెన్నైపై ధోనీ భార్య సాక్షి భావోద్వేగం
ఇంటర్నెట్డెస్క్: టీ20 లీగ్ చరిత్రలో చెన్నై తొలిసారి ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం కోల్పోయింది. ఆదివారం రాజస్థాన్.. ముంబయిని ఓడించడంతో చెన్నై కథ ముగిసింది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో ధోనీసేన.. బెంగళూరుపై విజయం సాధించినా 12 మ్యాచ్ల్లో 8 పాయింట్లే సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే మిగతా రెండు మ్యాచ్లు గెలిచినా చెన్నై ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు మూసుకుపోయాయి. 2008 నుంచీ ఆడుతున్న చెన్నై ఇలా విఫలమవ్వడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగపూరిత పోస్టు చేసింది. ఇది చెన్నై అభిమానులనే కాకుండా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం.. ఇదొక ఆట మాత్రమే!
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన చోటే మరికొన్ని దారుణ వైఫల్యాలు చవిచూశాం.
అందులో ఎన్నో ఏళ్లు గడిచిపోయినా.. గెలిచినప్పుడు సంతోషించాం, ఓడినప్పుడు బాధపడ్డాం.
కొన్ని గెలుపొందాం, మరికొన్ని ఓడిపోయాం. ఇంకొన్ని వదులుకున్నాం.. ఇదొక ఆట మాత్రమే!
ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాలు..
కానీ, ఒక క్రీడాకారుడిగా ఈ భావోద్వేగాలు నీ స్ఫూర్తిని అధిగమించేలా చేయకు.
ఇదో ఆట మాత్రమే!
ఓడాలని ఎవరూ అనుకోరు, అలా అని అందరూ గెలవలేరు!
ఆటలో ఆగిపోయినప్పుడు మైదానాన్నీ వీడడం భారంగా ఉంటుంది. ఇదొక ఆట మాత్రమే!
మీరు అప్పుడూ విజేతలే, ఇప్పుడూ విజేతలే
నిజమైన యోధులు పోరాడటానికే పుడతారు. మా మదిలో, హృదయాల్లో ఎప్పటికీ నిలచే సూపర్ కింగ్స్లా!!