close

తాజా వార్తలు

Updated : 11/11/2020 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓటీటీ, ఆన్‌లైన్ న్యూస్ పోర్టళ్లపై నియంత్రణ

సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రం ఉత్తర్వులు

దిల్లీ: ఆన్‌లైన్ న్యూస్ పోర్టళ్లు, కంటెంట్‌ ప్రొవైడర్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకువస్తూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఇప్పటివరకు ప్రత్యేక చట్టం కానీ, స్వయంప్రతిపత్తి సంస్థ కానీ లేకపోవడంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, సినిమాలు, ప్రింట్ మీడియా, న్యూస్‌ చానళ్లు.. సెన్సార్‌ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్‌ సర్టిఫికేట్, ప్రెస్‌ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్ వంటి సంస్థల పర్యవేక్షణలో ఉన్నాయి.  

కాగా, స్ట్రీమింగ్‌, డిజిటల్ మీడియాల ప్లాట్‌ఫాంలలో క్లియరెన్స్ గురించి ఆందోళన చెందకుండా కంటెంట్‌ను విడుదల చేయడానికి వీలు దొరికిందని.. ఒక స్వయంప్రతిపత్తిగల సంస్థ ఓటీటీ ప్లాట్‌ఫాంలను నియంత్రించాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై స్పందన కోరుతూ.. కేంద్రం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో, డిజిటల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ మంత్రిత్వ శాఖ కోర్టుకు వెల్లడించింది. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. గతేదాడి ఈ అంశంపై సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మాట్లాడుతూ..మీడియా స్వేచ్ఛను హరించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోదని, ప్రింట్, ఎలక్ట్రానిక్‌, సినిమాలకు ఉన్నట్లుగానే ఓటీటీలపై కూడా నియంత్రణ ఉండాలని వెల్లడించారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని