close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120062770 [video_srlno] => 1 [video_type] => 5 [video_link] => B_1xaf4A6PQ [video_short_link] => B_1xaf4A6PQ [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-05-11 14:17:38.115362 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 11/05/2020 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తండ్రికి శుభాకాంక్షలు చెప్పిన దిల్‌రాజు కుమార్తె

‘మీరు సంతోషంగా ఉండాలి’

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 7.23 గంటలకు నిజామాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తేజస్వినితో ఆయన పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘మీరు ఎల్లప్పుడూ నాకు బలంగా ఉన్నారు. నన్ను సంరక్షించినందుకు.. నిరంతరం కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరు సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా.. మీ హన్షు’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.

దిల్‌రాజు సతీమణి అనిత 2017లో అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో దిల్‌రాజుకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పారు. DilRaju అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌ టాప్‌లో ఉంది. 2,210 మందికిపైగా ఈ ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. ఆయన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.