close
Array ( ) 1

తాజా వార్తలు

ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మహిళలకు భద్రత కల్పించే ఈ చారిత్రక బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం తనకు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. జగన్‌ మహిళా పక్షపాతి అన్నారు. హైదరాబాద్‌ దిశ ఘటనను చూసి మానవత్వం ఉన్న ప్రతి మనిషీ చలించిపోయారన్నారు. ఈ ఘటన తర్వాత తమ బిడ్డలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. పట్టపగలు కూడా మహిళలు బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 

‘ఏపీలో మహిళలందరికీ జగనన్న ఒక రక్ష.. ఎవరైనా మహిళలపై చేయి వేస్తే పడుతుంది కఠిన శిక్ష’ అనే విధంగా రాష్ట్రంలో  చట్టాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎక్కడైనా దారుణమైన నేరాలు జరిగి నెలలు గడుస్తున్నా శిక్షలు పడకపోవడంతో నేరస్థులు నిర్భీతిగా సమాజంలో తిరుగుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో  నేరం చేసినవారిపై కేసులు నమోదు అయిన తర్వాత 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్షపడేలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ప్రత్యేక కోర్టులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ ‘దిశ’గానే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. మహిళలు, చిన్నారులపై క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష తప్పదని హెచ్చరించారు.

దేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలంతా అభద్రతా భావంతో బతుకుతున్నారని సుచరిత ఆవేదన వ్యక్తంచేశారు.  నేరస్థులు నిర్భయంగా తిరుగుతున్న పరిస్థితుల్లో ఏపీలో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించాలని సంకల్పించిన జగన్‌కు మహిళల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో పొందుపరిచినట్టు వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించే విధంగా 354 (ఈ) సెక్షన్‌ను ఈ బిల్లులో పొందుపరిచామన్నారు. శిక్ష పడిన వారు బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అలాంటి నేరాలు చేస్తే నాలుగేళ్లు కఠిన శిక్ష పడే అవకాశం ఉందన్నారు. బాల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిపట్ల అఘాయిత్యాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈ చట్టంలోని 354 (ఎఫ్‌)తో పదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండేలా మార్పులు చేశామన్నారు. మహిళలకు ఆంధ్రప్రదేశ్‌ ఓ అభయాంధ్రప్రదేశ్‌గా ఉందని నిరూపించే విధంగా చట్టాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. వీటిని సమర్థంగా వినియోగించుకొని ప్రతి మహిళా రక్షణ పొందాలని ఆకాంక్షించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.