దశలవారీగా న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ ఎత్తివేత
close

తాజా వార్తలు

Published : 09/06/2020 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దశలవారీగా న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ ఎత్తివేత

ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు


 

హైదరాబాద్‌: తెలంగాణలో విధించిన న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ను దశలవారీగా తొలగించేందుకు హైకోర్టు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జూన్‌ 15 నుంచి రాష్ట్రంలోని జిల్లా కోర్టులు తెరవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టుల్లో ఈ నెల 15 నుంచి ఆగస్టు 8 వరకు దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసేలా హైకోర్టు ప్రణాళిక రూపొందించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. జిల్లా కోర్టుల్లో ఆగస్టు 8 వరకు పరిమిత సంఖ్యలోనే కేసుల విచారణ చేపట్టాలని సూచించింది. హైకోర్టులో ఈ నెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే విచారణ కొనసాగించనున్నట్లు పేర్కొంది. గతంలో ప్రకటించిన విధంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల లాక్‌డౌన్‌ ఈ నెల 28 వరకు యాథావిధిగా కొనసాగుతుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని