close
Array ( ) 1

తాజా వార్తలు

సల్మాన్‌కు దక్కాల్సిన భవనం

ముంబయి: మన్నత్‌.. ముంబయిలోని అతి సుందరమైన భవనాల్లో ఇదొకటి. అంతేకాదు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ నివాసమిది. అయితే ఈ ఇంటిని తొలుత సల్మాన్‌ ఖాన్‌ కొనుగోలు చేయాల్సి ఉంది. సల్మాన్‌ కెరీర్‌ తొలినాళ్లలో ఈ భవనాన్ని కొనే అవకాశం వచ్చింది. భవనం చూడటానికి కూడా చాలా రాయల్‌గా ఉంటడంతో సల్మాన్‌ కూడా  ముచ్చటపడ్డారు.

ఇదే విషయాన్ని తన తండ్రి సలీమ్‌ ఖాన్‌కు చెబితే.. ‘ఇంత పెద్ద ఇల్లు తీసుకుని ఏం చేస్తావ్‌?’ అన్నారట. దాంతో ఈ ఇంటిని షారుక్‌ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సల్మాన్‌ ఒకానొక సందర్భంలో వెల్లడించారు. అయితే ఇంత పెద్ద ఇంట్లో షారుక్‌ ఏం చేస్తాడని అడగాలనుకుంటున్నట్లు సల్మాన్‌ చమత్కరించారు. మన్నత్‌ నివాసం వద్ద రోజూ వందల మంది వచ్చి సెల్ఫీలు దిగి పోతూ ఉంటారట.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.