టిక్‌టాక్‌ బ్యాన్‌.. ఆ తర్వాత అలీబాబానే
close

తాజా వార్తలు

Updated : 16/08/2020 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌ బ్యాన్‌.. ఆ తర్వాత అలీబాబానే

పరిశీలిస్తున్నామని చెప్పిన ట్రంప్‌

వాషింగ్టన్‌ : చైనీస్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై నిషేధం అనంతరం అమెరికా అధ్యక్షుడి కన్ను మరికొన్ని చైనా‌ కంపెనీలపై పడింది. చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు ఉన్న ఇతర అవకాశాలు కూడా పరిశీలిస్తున్నామని ఆయన శనివారం ప్రకటించారు. చైనాకు చెందిన అలీబాబాలాంటి ఇతర సంస్థలపై ఆంక్షలు పరిశీలిస్తారా? అని శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో విలేకరి ప్రశ్నిచంగా ‘అవును.. మేము ఇతర అంశాలను పరిశీలిస్తున్నాం’ అని ట్రంప్‌ తెలిపారు.

అమెరికాలో టిక్‌టాక్‌ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశ కంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా మరో 45 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో సారి పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రతను బైట్‌డ్యాన్స్‌ ప్రమాదంలోకి నెట్టివేస్తుందనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ట్రంప్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలను పూర్తిగా మార్చివేస్తున్న ట్రంప్‌.. ఆ దేశంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వుయ్‌ చాట్‌, అలీబాబా వంటి దిగ్గజ సంస్థలపై ట్రంప్‌ కార్యవర్గం దృష్టిపెట్టే అవకాశాలున్నాయని అమెరికా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. గత వారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో ఓ సందర్భంలో అలీబాబా పేరును నేరుగా ప్రస్తావించారు. దీంతో ఈ సారి అమెరికా టార్గెట్‌లో ఈకామర్స్‌ దిగ్గజం ఉన్నట్లు భావిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని