రెడ్‌జోన్లలో అద్దె అడగొద్దు
close

తాజా వార్తలు

Updated : 19/04/2020 10:57 IST

రెడ్‌జోన్లలో అద్దె అడగొద్దు

దాతలు, స్వచ్ఛంద సంస్థలు
ముందుకు రావాలని కలెక్టర్‌ పిలుపు

కలెక్టరేట్‌(గుంటూరు): రెడ్‌ జోన్‌ ప్రాంతాలలో మూడు నెలల పాటు అద్దె అడగవద్దని జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని శంకరన్‌ హాలు వద్ద శనివారం విలేకర్లతో మాట్లాడారు. అద్దెలు చెల్లించాలని యజమానులు ఒత్తిడి తెస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పలు ప్రాంతాలలో అధికారులు పర్యటించిన సమయంలో అక్కడి ప్రజలు ఇబ్బందులను తెలిపారని, ప్రభుత్వం తరపున అన్ని సదుపాయాలను తొలుత అక్కడి నుంచే అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో కొవిడ్‌19 కింద ఎన్‌ఆర్‌ఐ, జీజీహెచ్‌, కాటూరి మెడికల్‌ కళాశాల ఆసుపత్రి, తెనాలి ప్రభుత్వాసుపత్రి, మణిపాల్‌, డీవీసీ, లలిత ఆసుపత్రులను ఎంపిక చేశామన్నారు. ఎన్‌ఆర్‌ఐలో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ వ్యక్తులు ఉన్నారని తెలిపారు. మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన 1500 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ట్రూ నాట్‌ పరీక్షలు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మాచర్లలో ప్రారంభించామని, పరీక్షలను వేగవంతం చేస్తామన్నారు. జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన వారిలో ఇద్దరు కోలుకున్నారని, వారిని ఇంటికి పంపామన్నారు. 15 పాజిటివ్‌ కేసులు నమోదైతే రెడ్‌జోన్‌గా ప్రకటిస్తామని, తక్కువ కేసులుంటే కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ప్రకటిస్తామన్నారు. తాడేపల్లి సమీపంలో ఒకరు కరోనాతో మృతిచెందారని, దీనిపై విచారణ చేస్తున్నామని, అయితే ఆ ప్రాంతం రెడ్‌జోన్‌ కాదని చెప్పారు.ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు తమవంతు సహకారం అందించాలన్నారు. హోటల్స్‌లో క్వారంటైన్‌ ఏర్పాటుకు యజమానులు సహకారం అందించాలని, కొన్ని హోటల్స్‌ యజమానులు సహకరించడం లేదని పేర్కొన్నారు. మే 3 వరకు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తామని, ప్రజలు దీనిని తప్పక పాటించాలన్నారు. ప్రభుత్వం కార్డుదారులకు ఆర్థిక సాయంగా ప్రకటించిన రూ.వెయ్యి ఇంకా అందని వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని